ఎన్టీఆర్ ‘అరవింద సమేత’.. ఫస్ట్‌లుక్‌

339
NTR as Aravinda Sametha Veera Raghava
- Advertisement -

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘అరవింద సమేత…’ అని టైటిల్ని ఖరారు చేశారు. ఉప శీర్షికగా ‘వీర రాఘవ’ పేరును తగిలించారు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ ఈ రోజు ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఇక మొట్టమొదటి సారిగా సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఎన్టీఆర్ ఇందులో అదరగొట్టేశాడు. ఈ లుక్ లో ఎన్టీఆర్‌ చాలా స్టైలిష్‌గా కండలవీరుడిగా కనపడుతున్నాడు. ఎట్టకేలకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో కనపడుతున్నట్లు స్పష్టం అయింది.

NTR as Aravinda Sametha Veera Raghava

ఇక ఎన్టీఆర్ లుక్ గురించి ఏం చెప్పాలి? నెవర్ బిఫోర్ అన్నట్లే ఉంది. ఇంతకముందు ‘టెంపర్’ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాడు కానీ.. ఇప్పుడు మరింత పర్ఫెక్టుగా ఉంది. చేతిలో కత్తి పట్టి చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు తారక్. మాస్ కు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది ఈ లుక్. ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందన్న ప్రచారాలకు తగ్గట్లే పోస్టర్ బ్యాగ్రౌండ్ ఉంది. లుక్ మాస్ గా ఉంటే.. టైటిల్ చాలా క్లాస్ గా ఉంది.

పూజా హెగ్డే కథానాయికగా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నాడు. ‘హారిక హాసిని క్రియేషన్స్’ బేనర్ మీద త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఆయన మిత్రుడు ఎస్.రాధాకృష్ణనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ‘అజ్ఞాతవాసి’ దారుణమైన దెబ్బ కొట్టిన నేపథ్యంలో ఈ చిత్రంపై ఇద్దరు మిత్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -