సామాన్యులపై జీఎస్టీ..అదానీ పోర్టులపై నో జీఎస్టీ!

75
- Advertisement -

ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి కేటీఆర్. జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును అదానీ గ్రూప్‌నకు బదిలీ చేసిన కేంద్రం దానిపై ఎలాంటి జీఎస్టీ విధించలేదు. ఇందుకు సంబంధించిన న్యూస్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కేటీఆర్.. దేశంలో సామాన్య ప్రజలకు పాలు, పెరుగు లాంటి నిత్యావసరాలపై కూడా జీఎస్టీ విధిస్తారు. కానీ, అదానీ లాంటి అసామాన్యులు ఏకంగా ఎయిర్‌పోర్టులు పొందినా ఎలాంటి జీఎస్టీ ఉండదా అని ప్రశ్నించారు.

ఇలా మిత్రులకు ఇవ్వడం ఉచితం కాదట.. ప్రధానికి కృతజ్ఞతలు అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. కేంద్రం ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టుగా ఇది అమృత కాలం కాదని, ఎ మిత్ర్‌ కాలమని (దోస్తుల కాలమని) మంత్రి కేటీఆర్ విమర్శించారు.

- Advertisement -