- Advertisement -
ఉపరాష్ట్రపతి ఎన్నికకూ దూరంగా ఉంటామంటూ టీఎంసీ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా స్పందించారు. ఇది కోపం అహం చూపించే సమయం కాదని, ప్రతిపక్షాల ఐక్యత కోసం పోరాడాల్సిన సమయమని.అని ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికకూ దూరంగా ఉంటామని టీఎంసీ నిన్న కీలక నిర్ణయం తీసుకొంది. ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించడంలో విపక్షాల వైఖరే కారణమని పేర్కొన్నారు. టీఎంసీని సంప్రదించకుండా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయడం అభ్యంతరకరమని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. కాగా ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన విపక్షాలకు దీదీ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బే..!
- Advertisement -