వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీయేతర పార్టీలు ఒక్క తాటిపైకి రావాడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం జూన్ 23న బీహార్‌లోని పాట్నాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఈ సందర్భంగా 2024లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్లాలని వ్యూహరచన చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనం.
ఈ సమావేశానికి నాయకత్వం వహించేందుకు బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సుముఖత చూపనున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ సమావేశాలను పాట్నాలో ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎకమై ఇదే నగరంలో జయప్రకాశ్ నారాయణ్ ఆధ్యక్షతన నాడు సమావేశం జరిగింది. అయితే ఈ సారి బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొననుంది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు ఎకమైతే దాదాపుగా 450స్థానాల్లో ద్విముఖ వ్యూహాన్ని అమలు పరచాలని భావిస్తున్నట్టు సమాచారం. అంటే ఈ స్థానాల్లో బీజేపీకి ఒకేఒక ప్రతిపక్ష అభ్యర్థిని దించాలని అలాగే వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా వన్ టూ వన్ ఫార్ములా గురించి మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. ఈ ఫార్ములాను తొలుత టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు సమాచారం. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది ఆచరణలో ఇది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి జూన్ 23 వరకు ఆగాల్సిందే.
Also Read: KTR:రాష్ట్రంలో చెరువుల పండుగ
ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరు కానున్నట్టు సమాచారం. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఝార్ఖండ్ సీఎం హేమంత సోరేన్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ నుంచి
శరద్ పవార్, శివసేన (యూబీటీ) నుంచి ఉద్దవ్ ఠాక్రేలు హాజరవుతారని తేజస్వీ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ సింగ్ లన్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఈ సమావేశానికి వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొననున్నట్టు తెలిపారు.
Also Read: షెడ్యూల్ ప్రకారమే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు!