వరుణ్ తేజ్ హీరోగా శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ వాలంటైన్’. ఈ సినిమాని పుల్వామా అటాక్, దానికి కౌంటర్ అటాక్ ఆధారంగా తెరకెక్కించారు. మూవీలోని గాలి చేసే యుద్ధం సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రుద్రగా వరుణ్ తేజ్ అద్భుతంగా నటించారు. అయితే VFX, సినిమాటోగ్రఫీ విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. పైగా సినిమాలో ఎమోషన్ బాగా వర్కౌట్ కాలేదు అని, అదే సినిమాకి అతి పెద్ద మైనస్ అయ్యింది అని టాక్ నడుస్తోంది.
అయితే, ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 4 నిమిషాలు ఉండటం పెద్ద రిలీఫ్. మొత్తానికి ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ రూ. 26 కోట్లకి సొంతం చేసుకున్నట్లు సమాచారం. మ్యూజిక్ రైట్స్‌కి రూ. 2.6 కోట్లు దక్కాయట. తెలుగు శాటిలైట్ డీల్‌ను రూ. 6.5 కోట్లకి క్లోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి, ‘ఆపరేషన్ వాలెంటైన్’కి నష్టాలు లేనట్టే. అన్నట్టు ఈ సినిమాలో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించారు. సినిమాలో మానుషి చిల్లర్ పాత్ర కూడా చాలా బలంగా ఉందట.
శక్తిప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మిర్ సర్వార్, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మ్యూజిక్ బాగున్నా.. సినిమాలో మేటర్ లేకపోవడంతో అది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఓవరాల్ గా ఆపరేషన్ వాలంటైన్ ఏవరేజ్ సినిమాగా నిలిచింది.
Also Read:పిక్ టాక్ : నేహా అందాల అరాచకం