‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ

314
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఓపెనింగ్, టైటిల్స్ మినహా ఈ సినిమా రన్ టైమ్ 2.04 గంటలుగా ఉండనుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ భారత వాయుసేన వింగ్ కమాండర్ రుద్రగా కనిపించనున్నారు. కాగా ఈ సినిమా సెన్సార్ టాక్ ముందే వచ్చేసింది. మరి ఈ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాకి సెన్సార్ టాక్ ఎలా ఉంది ?.

‘ఆపరేషన్ వాలెంటైన్’ లో ఎమోషన్స్ ఏవరేజ్ గా ఉన్నాయట.

ఐతే, రెండు యాక్షన్ సన్నివేశాలు సూపర్ గా ఉన్నాయట.

మెగా హీరో వరుణ్ తేజ్ మాస్ మూమెంట్స్ ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందట.

వరుణ్ తేజ్, హీరోయిన్ మధ్య లవ్ సన్నివేశాలు కూడా హైలెట్ అట.

వరుణ్ తేజ్ పాత్ర పై క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ అదుర్స్.

ఇక కథ విషయానికి వస్తే.. సాధారణ కథ అనే తెలుస్తోంది.

ఓవరల్ గా వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చింది సెన్సార్ టీం నుంచి. కాకపోతే, మెగా అభిమానులు కోరుకునే ఎలిమెంట్స్ అన్ని ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో ఉన్నాయి. కాబట్టి, నిర్మాతలు, బయ్యర్లు నిశ్చింతగా ఉండొచ్చు ఏమో. ఒకవేళ, ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాకి బ్యాడ్ టాక్ వస్తే.. సినిమాకి పూర్తిగా నష్టాలు తప్పవు.

Also Read:పీవీ బయోపిక్.. ‘హాఫ్ లయన్’

- Advertisement -