ఆపరేషన్ నిజాముద్దీన్ @ తబ్లీగీజమాత్-మర్కజ్

312
markaj
- Advertisement -

దేశవ్యాప్తంగా ‘మర్కజ్‌’ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తబ్లిగీ జమాత్‌ సంస్థకు చెందిన అంతర్జాతీయ ప్రధాన కార్యాలయమైన ‘నిజాముద్దీన్‌ మర్కజ్‌’లో ఈ నెల 1-15 మధ్య మతపరమైన కార్యక్రమం జరిగింది. వివిధ దేశాలకు చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గత నెల రోజుల్లో దాదాపు 8,000 మంది ఈ మర్కజ్‌ను సందర్శించినట్లు సమాచారం అందడంతో ఆపరేషన్ నిజాముద్దీన్‌ను మొదలుపెట్టాయి.

తబ్లీగీ జమాత్ కు వెళ్లిన వాళ్ళకోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ నుంచి 2200 మంది హాజరైనట్లు సమాచారం అందడంతో వీరికోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ఇప్పటికే 2 వేల మందికి టెస్టులు, క్వారెంటైన్ కు తరలించారు. గత 15 రోజులుగా వాళ్ళు ఎవరితో క్లోజ్ గా మూవయ్యారు, క్యాజువల్ గా ఎవరెవరిని కలిశారనే దానిపై ఇంటలిజెన్స్ ఆరా తీస్తోంది.

ఒకేరోజు 6 గురు చనిపోవడంతో నిన్న పరీక్షలకు 700 మంది హాజరయ్యారు. సోమవారం 1300 మందికి పరీక్షలు, క్వారెంటైన్ కు తరలించారు..మరో 200 మందిని గుర్తించి టెస్టులకు పంపేలా ఏర్పాట్లు చేశారు.

మర్కజ్ వెళ్లినవాళ్ళ లిస్ట్ కొలిక్కి రావడంతో వాళ్ళ క్లోజ్, క్యాజువల్, ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ పై దృష్టిసారించారు అధికారులు.తబ్లీగీ జమాత్ కు వెళ్లి వచ్చిన వాళ్ళు తిరిగిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తుల వివరాల సేకరిస్తున్నారు. తెలంగాణలో 82 మంది విదేశీ తబ్లీగీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

- Advertisement -