- Advertisement -
ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు కేంద్రం ప్రకటించింది. పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై ఆర్మీ చేపట్టిన దాడుల్లో 100 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని… ఈ దాడితో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతమైందని తెలిపారు.
ప్రతీకార చర్యలు ఉంటాయని పాక్ ప్రకటించిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజస్థాన్ , పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేయడమే కాదు బహిరంగ సభలపై కూడా నిషేధం విధించాయి.
Also Read:దేవుడు వరమిచ్చినా..పూజారి వరమివ్వలేదు!
- Advertisement -

