ఎమ్మెల్యేల కోనుగోలు..హైకోర్టు కీ ఆదేశాలు

128
- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్యేల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫాం హౌజ్ లో ఎమ్మెల్యేలను కొనుగోలుకు యత్నించిన సంగతితెలిసిందే. ఈ వ్యవహరంలో ఇప్పటికే రెండు పార్టులుగా ఆడియో క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులు హైదరాబాద్ ను వదిలి ఎక్కడికి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది.

నిందితులను గురువారం రాత్రి ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ రిమాండ్‌కు నిరాకరించింది. దాంతో సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో నిందితులు ముగ్గురు 24 గంటలపాటు హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను శనివారం ఉదయం తొలి కేసుగా చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

జెర్సీ హీరో పెళ్లి.. వధువు ఎవరంటే ?

మహేష్ బాబు అరుదైన రికార్డ్

మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే

- Advertisement -