ఆపరేషన్ కగార్… కొనసాగుతుంది

18
- Advertisement -

ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని కేంద్రం వెల్లడించింది. అయితే ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సీఆర్పీఎఫ్‌ కోబ్రా జవాన్లు తమ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.

మావోయిస్టుల కోసం కర్రెగుట్టలను జల్లడపడుతున్నాయి సీఆర్‌పీఎఫ్‌ బలగాలు. దాదాపు ఐదు వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి పిలిపిస్తున్నది. వీరిని సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో వీరి సేవలను బోర్డర్‌ వినియోగించనుంది కేంద్రం.

ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని వెంకటాపురం, ఆలూబాక, వీరభద్రవరం, పామునూరు పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. ఆదివారం ఉదయం లోపు వీరంతా సరిహద్దుల్లోకి వెళ్లనున్నారు.

Also Read:బరువు తగ్గడానికి అధ్బుతమైన టిప్స్

- Advertisement -