ఆపరేషన్ కగార్..మావోలకు దడ!

13
- Advertisement -

మావోయిస్టులకు దడ పుట్టిస్తుస్తోంది ఆపరేషన్ కగార్. ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టలను చుట్టుముట్టి హెలికాప్టర్ల ద్వారా గుట్టలపై ఉన్న మావోయిస్టులను వెతుకుతున్నాయి పోలీసు దళాలు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు, కీలక నేతలు గుట్టలపై ఉన్నట్లుగా పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అడుగడుగు జల్లెడ పడుతున్నారు.

కీలక నేతలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళినట్లుగా తెలుస్తోండగా మూడు రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. చత్తీస్ ఘడ్, తెలంగాణ సరిహద్దు కర్రే గుట్టలపై పోలీసులకు మావోయిస్టులకి మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా అర్ధరాత్రి 12 గంటలకు మెరుపు దాడి ప్రారంభించాయి భద్రతా బలగాలు. అలాగే ఐదు ఆర్మీ హెలికాప్టర్లతో కర్రిగుట్టలను జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. డ్రోన్ల సహాయంతో బాంబుల వర్షం కురిపించగా భారీగా మావోయిస్టులు మృతి చెంది ఉంటారని తెలుస్తోంది.

Also Read:హిమాచల్, తిరుమలలో హై అలర్ట్

- Advertisement -