కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ కన్నుమూత..

58
- Advertisement -

సీనియర్ కాంగ్రెస్ నేత, కేరళ మాజీ సీఎం ఉమెన్‌ చాందీ కన్నుమూశారు. ఆయన వయస్సు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

1943, అక్టోబర్‌ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్‌లో ఊమెన్‌ చాందీ జన్మించారు. 1970లో పూతుపల్లి నుంచి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. మొత్తం 12 సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Also Read:ఘనంగా నెల రోజులపాటు…”బోనాలు”

1977లో కే.కరుణాకరన్‌ మంత్రివర్గంలో చేరారు. 2004 నుంచి 2006 వరకు, 2011-2016 వరకు రెండుసార్లు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేరళ కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు చాందీ. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని కాంగ్రెస్ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read:యూపీఏ మార్పు.. కాంగ్రెస్ ఒప్పుకుంటుందా?

- Advertisement -