ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత మనం వినే ఉంటాం..ఈ సామెతను బట్టే ఉల్లితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇట్టే అర్థమైపోతుంది. వంటల్లో ఉల్లిపాయ లేని రుచిని మనం ఊహించుకోలేము. ఉల్లిపాయను కచ్చపచ్చిగా కూడా తింటూ ఉంటాము. ఉదయం పూట గాని లేదా సాయంత్రం పూటగాని సరదాగా బజ్జీలు, లేదా వడలు వంటివి తినేటప్పుడు వాటికి కాంబినేషన్ గా ఉల్లిపాయను కూడా జతచేసుకొని తింటూ ఉంటాము. అయితే ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ఊయయోగాల గురించి మాత్రం చాలమందికి తెలియదు. ముఖ్యంగా ఉల్లిరసం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఉల్లిరసాన్ని ఆయుర్వేద ఔషధాలలో కూడా వినియోగిస్తూ ఉంటారు. మరి ఉల్లి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
ఉల్లిలో యాంటీ అలర్జీటిక్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ కర్సినోజెనిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి పలు రకాల ఆరోగ్య రుగ్మతల నుంచి విముక్తి కలుగజేస్తాయి. ముఖ్యంగా ఉల్లిరసం ప్రతిరోజూ తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయవచ్చు. ఉదయాన్నే పడగడుపున ఈయొక్క ఉల్లిరసాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి 50 శాతం వరకు కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక కిడ్నీ నొప్పితో భాద పడేవాళ్ళు ప్రతిరోజూ ఉల్లిరసం తాగితే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆ నొప్పి నుంచి విముక్తి కలుగజేస్తుంది. ఇక ఉల్లిలో ఉండే క్రోమియం, అల్లైల్ ఫ్రొఫైల్ డైసల్ఫెట్ వంటివి రోగనిరోధక శక్తిని పెంచి పలు రకాల ధీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఇక ఎన్నో రోజులుగా ఆర్థరైటిస్ ( కీళ్ల నొప్పులు ) తో భాడపడే వాళ్ళకు ఉల్లిరసం ఒక చక్కటి వరంలా పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
Also Read:మీరే విస్తరించారు..మీరే వాయిదా వేశారు!
ఉల్లిపాయను అధికంగా తింటే కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఇందులో అధికంగా ఉండే పొటాషియం కారణంగా పొటాషియం ఎక్కువైతే గుండెల్లో మంట వచ్చే అవకాశముంది. ఇక ఉల్లి అధికంగా తింటే నోటి దుర్వాసన కూడా వస్తుంది.