పార్లమెంటులో జమిలి ఎన్నికల బిల్లుపై అధికార,విపక్ష సభ్యలు మధ్య మాటల యుద్ధం నెలకొంది. బిల్లుకు ఎన్డీఏ పక్షాలు మద్దతివ్వగా విపక్షాలు వ్యతిరేకించాయి.జేపీసీకీ అభ్యంతరం లేదని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లు పెట్టాలా ? , జేపీసీకి పంపాలా ? అన్న విషయంపై డివిజన్ కు అనుమతించారు స్పీకర్.ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు సభ్యులు.
బిల్లుకు అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 149 ఓట్లు వచ్చాయి. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్లైంది. దేశంలో లోక్‌సభతోపాటే వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికల నిర్వహించడం కోసం వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును తీసుకొచ్చారు.
ఇది 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ఇవాళ ఉదయం వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
Also Read:పార్లమెంట్ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు