ఒక్క ప్లాప్ ఎన్నెన్నో నేర్పించింది

52
- Advertisement -

కాలం కలిసి వస్తే సామాన్యుడు కూడా అసాధ్యుడు అవుతాడు. అదే కాలం కలిసి రాకపోతే అసాధ్యుడు కూడా సామాన్యుడిగా మిగిలిపోవాల్సి వస్తోంది. టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ విషయంలో ఈ ఉదాహరణ చక్కగా సరిపోతుంది. లైగర్ సినిమా రిలీజ్ ముందు వరకూ.. విజయ్‌ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ లో హడావుడి చేశాడు. అతనికి మీడియా కూడా ఆ రేంజ్ హైప్ ఇచ్చింది. కానీ, ఒక్క ప్లాప్ పడగానే విజయ్‌ దేవరకొండ స్థాయి మళ్లీ లోకల్ బాయ్ దగ్గరకు వచ్చి ఆగింది. అందుకే, మళ్లీ తనకు తగ్గ కథలతో ముందుకు వెళ్తున్నాడు.

‘గీత గోవిందం’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో విజయ్‌ దేవరకొండకి మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. పరశురామ్‌ దర్శకత్వం వహించారు. అయితే, వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిస్తున్న చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇది ఓ సాధారణ యువకుడి కథ. పరిధి దాటి యాక్షన్ సీన్స్ ఈ కథలో లేవు. పైగా విజయ్‌ దేవరకొండ పాత్ర చాలా సహజంగా ఉంటుందట.

Also Read: క్లైమాక్స్ కి చేరుకున్న భోళా శంకర్

మొత్తానికి ఒక్క ప్లాప్ దెబ్బకు విజయ్‌ దేవరకొండకు తత్త్వం బోధ పడినట్టు ఉంది. అలాగే విజయ్‌ దేవరకొండ మరో సినిమా కూడా చేస్తున్నాడు. ‘వీడీ12 (వర్కింగ్ టైటిల్‌)’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైందని తెలుపుతూ విజయ్‌ దేవరకొండ తన ట్విటర్‌ ఖాతాలో ఓ ఫొటోను కూడా పంచుకున్నాడు. ఈ మూవీని యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో అరుపులు, కేకలు ఏమీ ఉండవు అట. కథ చాలా సహజంగా ఉంటుందట. మొత్తమ్మీద ఒక్క ప్లాప్ విజయ్‌ దేవరకొండకి ఎన్నెన్నో నేర్పించింది.

Also Read: ‘గుంటూరు కారం’ కొత్త షెడ్యూల్ అప్పుడే

- Advertisement -