బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ రయిస్ చిత్ర ప్రమోషన్ కోసం చేపట్టిన రైలు ప్రయాణంలో అపశ్రుతి చోటు చేసుకొని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రయిస్ ప్రమోషన్ కోసం షారుక్ ముంబయి సెంట్రల్ నుంచి దిల్లీలోని హజ్రత్‌నిజాముద్దీన్ స్టేషన్ వరకు అగస్త్‌క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు.షారుక్ ప్రయాణిస్తున్న రైలు సోమవారం రాత్రి 10.30గంటలకు వడోదర స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నెంబర్ 6కు చేరుకుంది. ఇక్కడ 10నిమిషాలు మాత్రమే ఆగనుండటంతో అభిమానులు ఒక్కసారిగా రైలువైపు దూసుకెళ్లి కిటికీలను కొట్టడం మొదలుపెట్టారు.
దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని అభిమానులను అదుపు చేశారు. హాల్టు అనంతరం రైలు కదలడంతో భారీ సంఖ్యలో అభిమానులు పరుగులు తీశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అభిమానులను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. మృతుడు ఫరీద్‌ఖాన్ పఠాన్‌గా గుర్తించారు.
షారుక్‌ను కలిసేందుకు వచ్చిన అభిమానుల్లో ప్రముఖ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్‌పఠాన్‌లు కూడా ఉండటం విశేషం. వారు బోగిలోకి వెళ్లి షారూక్‌ను కలుసుకున్నారు.