మొక్కులు చెల్లించుకున్న కోటిన్నర మంది

436
medaram
- Advertisement -

తెలంగాణ కుంభమేళ, ఆసియాలోనే అతిపెద్ద మేడారం గిరిజన మహాజాతర ముగిసింది. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మొదలైన మేడారం మహాజాతర గురువారం సమ్మక్క రాకతో పరిపూర్ణమైంది. శనివారం సాయంత్రం తల్లుల వనప్రవేశంతో జాతర ముగిసింది.

ఈసారి మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు తరలివచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జాతర నిర్వహణలో భాగస్వామ్యమైన శాఖల మంత్రులు, సమస్త అధికారులు మేడారంలో తిష్టవేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. ఆర్టీసీ రికార్డుస్థాయిలో రాష్ట్ర నలుమూలల నుంచి నాలుగువేల బస్సులు, 36 వేల ట్రిప్పులతో 20 లక్షల మంది భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది.

వనమంతా జనమైన మేడారం జాతర ముగియడంతో భక్తులు తిరిగి ఇంటిముఖం పట్టారు. మహాజాతర చివరిరోజు సైతం భక్తుల ప్రవాహం తగ్గలేదు. మధ్యాహ్నం 45 నిమిషాలపాటు మేడారంలో భారీ వర్షం కురిసింది. వర్షంలోనూ తల్లులను దర్శించుకొనేందుకు భక్తులు పోటీపడ్డారు.

- Advertisement -