వన్ క్లాస్ – వన్ టీచర్ విధానం!

21
- Advertisement -

ఏపీలో వన్ క్లాస్ వన్ టీచర్ నివాసం అమలు చేస్తామని తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేష్. విద్యార్థులపై బ్యాగ్‌ భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అసెంబ్లీలో తెలిపారు.

విద్యార్థులపై బ్యాగ్‌ భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు..ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టుల పుస్తకాలను బైండ్‌ చేసి ఇస్తామన్నారు. 10 వేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానం అమలు చేస్తామని వెల్లడించారు. టీచర్లపై ఒత్తడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల బదిలీల చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించారు. జీవో 117పై అన్ని ఉపాధ్యాయ సంఘాలతోనూ చర్చించామన్నారు. వైసీపీ ఉపాధ్యాయ సంఘాన్ని కూడా చర్చలకు పిలిచామన్నారు. ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టుల పుస్తకాలను బైండ్‌ చేసి ఇస్తామన్నారు. అలాగే వారికి నాణ్యమైన యూనిఫామ్‌తో కూడిన కిట్‌ ఇస్తామని చెప్పారు.

Also Read:కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటం చేస్తాం:లక్ష్మణ్

- Advertisement -