ప్రపంచదేశాలపై BF7 పంజా..

250
- Advertisement -

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. చైనాలో కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్‌ 7 విజృంభిస్తోంది. తాజాగా భారత్‌లో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ BF.7 కేసులు మూడు బయటపడటంతో అంతా ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఈ కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. BF.7 అంటే ఇంతకు ముందు వచ్చిన BA.5.2.1.7 వేరియంట్‌ నుంచి పరివర్తన చెందిందే. ఇది ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ BA.5 నుంచి పరివర్తన చెందిన రకం. వ్యాక్సీన్ తీసుకున్నవాళ్లపై ఇది ఎక్కువ ప్రభావం చూపదని తెలుస్తోంది.

ఈ సబ్‌వేరియంట్ కారణంగానే ప్రస్తుతం చైనాలో కోవిడ్ కేసులు తీవ్రమవుతున్నాయని చెబుతున్నారు.ఈ వేరియంట్ వేగంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తోందని అంటున్నారు. ఈ సబ్‌వేరియంట్ కేసులు చాలా దేశాల్లో వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్‌ సహా పలు దేశాలో కేసులు బయటపడుతున్నాయి.

చైనాలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో, భారతదేశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. వేరియంట్‌లు, సబ్‌వేరియంట్‌లను గుర్తించడానికి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌లకు పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -