ఒమిక్రాన్..కొత్త మార్గదర్శకాలు జారీ

111
shamshabad
- Advertisement -

కరోనా కొత్త స్ట్రెయిన్ ఓమిక్రాన్ నేపద్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక ఏర్పాట్లు. 11హై రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త స్ట్రెయిన్ ఓమిక్రాన్ ద్వారా ఇన్ఫెక్షన్ కేసులు పెరగడంతో బారత ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల సౌకర్యాల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.

ప్రయాణికులు సురక్షితంగా ఉండేలా ప్రయాణించగలిగేలా ఇంటర్నేషనల్ అరైవిల్ హాల్ ప్రీ-ఇమ్మిగ్రేషన్ లో ప్రత్యేక కోవిడ్-19 టెస్టింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. అన్ని అరైవిల్ గేట్లు వద్ద థర్మల్ స్కానర్ లు ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా తప్పని సరిగా థర్మల్ స్క్రినింగ్ చేయించుకోవాలి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ముందస్తు RT-PCR/రాపిడ్ PCR పరీక్షల బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. RT-PCR పరిక్ష ఫలితం కోసం రూ. 750 (నిరీక్షణ సమయం 6 గంటలు) PCR పరిక్ష ధర రూ. 3,900 (2 గంటల నిరీక్షణ సమయం). శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు హై-రిస్క్ ఉన్న దేశాల నుండి వారంలో 12 విమానాలు ఉన్నాయి. బ్రిటిష్ ఎయిర్ వేస్ వారానికోసారి 3 డైరెక్ట్ విమానాలను నడుపుతుండగా ఎయిర్ ఇండియా లండన్ కి వారానికోసారి 2 డైరెక్ట్ విమానాలను నడుపుతుంది. సింగాపూర్ ఎయిర్ లైన్స్ సింగాపూర్ కు వారానికి మూడు సార్లు, స్కూట్ వారానికి 4 డైరెక్ట్ విమానాలను సింగగాపూర్ కు నడుపుతుంది.

- Advertisement -