రాధేశ్యామ్..ట్రైలర్ ముహుర్తం ఫిక్స్!

47
radhe shyam

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రాధే శ్యామ్. జనవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుండగా ఈ సినిమా అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ట్రైలర్‌ని ఈ నెల 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఒక వేళ డిసెంబర్ 17న మిస్ అయితే డిసెంబర్ 21న విడుదల చేయనున్నారని టాక్.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ లవ్ డ్రామా నుంచి మేకర్స్ ఇప్పటికే ప్రభాస్ ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేయగా, దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన రెండు పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. మరోవైపు హిందీలోనూ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సాంగ్‌ని రిలీజ్ చేశారు.