స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, “రాములో రాముల” పాటలు చిత్రం పై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.
ఇప్పుడు సంగీత దర్శకుడు థమన్ స్వరపరచిన చిత్రం లోని మరోగీతం ‘ఓ డాడీ’ ఈరోజు విడుదలైంది. సాహిత్య విలువలతో కూడిన,ఎన్నో విజయవంతమైన గీతాలను రచించిన గీత రచయిత కృష్ణ చైతన్య ఈ పాట రాసారు. ఈ పాటలో వచ్చే తెలుగు ర్యాప్ కూడా ఆయనే రాయడం విశేషం. తెలుగు ర్యాప్ ని బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడా పాడగా, ఇంగ్లీష్ ర్యాప్ ని ‘రాహుల్ నంబియార్’ పాడారు. ఫిమేల్ ర్యాప్ ని లేడీ కాష్ పాడింది. గాయకుడు ‘రాహుల్ సిప్లిగంజ్’ ఈ పాటను తన స్టయిల్ లో పాడి ఉర్రూతలూగించారు.. బ్లాజీ ఈ పాటకు గాత్ర సాయం చేశారు.
‘ఓ డాడీ’ గీతం విడుదలైన కొద్ది సమయానికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో మరో ఫేవరేట్ సాంగ్ గా చార్ట్ బస్టర్స్ లో టాప్ లో నిలుస్తోంది.మరో అద్భుతమైన పాటను అందించి, మరొక సూపర్ హిట్ ఆల్బమ్ ను తన ఖాతాలో థమన్ వేసుకున్నారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
https://youtu.be/JnxokaXq6TM