15 పెద్దపులులను దత్తత తీసుకున్న ఓం ప్రకాష్ మిశ్రా..

45
Om Prakash Mishra

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ మిశ్రా తన మానవత్వాన్ని చాటుకున్నారు. హైద్రరాబాద్‌ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని 15 పెద్దపులులనూ ఏడాది కాలం పాటు దత్తతకు స్వీకరించారు. ఈ సందర్భంగా వాటి ఆలన, పాలనకు అయ్యే ఖర్చు రూ. 15 లక్షల రూపాయల చెక్కులు రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్స్) ఆర్. శోభకు అందజేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ మిశ్రా.