వివాదంలో నాగార్జున సినిమా….

283
Om Namo Venkatesaya Controversy
- Advertisement -

ఈ మధ్య కొన్ని సినిమాలు లేనిపోని కాంట్రవర్శీల్లో చిక్కుకుంటున్నాయి. ఇంకా సినిమా సెట్స్‌ మీదికి వెళ్లకముందే వివాదాలు మొదలైపోతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150వ సినిమా కూడా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సీనియర్‌ హీరో అక్కినేని నాగార్జున కూడా తన కొత్త సినిమా విషయంలో వివాదాన్ని ఎదుర్కొంటున్నారు.

Om Namo Venkatesaya Controversy

నాగార్జున కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భక్తి రస చిత్రం ఓం నమో వెంకటేశాయ… ఈ సినిమా శ్రీ వారి భక్తుడైన హథీరాం బాబాజీ జీవిత చరిత్ర ఆధారంగా రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తున్నారు.. ఇప్పటికే ఆడియో వేడుక జరుపుకొని సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నది. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకొన్నది. ఓం నమో వెంకటేశాయ టైటిల్ ను మార్చాలని కొంత మంది విద్యార్ధులు ఆందోళనకు దిగారు.

Om Namo Venkatesaya Controversy

రాఘవేంద్ర రావు, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన భక్తి రస సినిమాలైన అన్నమయ్య, రామదాసు, వంటి సినిమాలకు భక్తుల పేర్లనే పెట్టినట్లు… తాజాగా సినిమా హథీరాం బాబాజీ టైటిల్ ను పెట్టాలని తిరుపతిలో విద్యార్ధులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీని కంటే ముందు హైదరాబాద్ లోని పలు సంఘాల నేతలు కూడా ఈ విషయంపై నిరసనలు వ్యక్తం చేశారు. ఓం నమోః వెంకటేశాయ సినిమా టైటిల్‌‌ ను మార్చాలని గతంలో సేవలాల్ సేన కూడా డిమాండ్ చేసింది. సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు భూక్య సంజీవ్‌నాయక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఓం నమోఃవెంకటేశాయ టైటిల్‌ను వెంటనే ‘హథీరామ్‌ బావాజీ’గా మార్చాలన్నారు. ఇలా వరసగా వివాదంలో ఇరుక్కున్న పడుతున్న ఈసినిమాపై చిత్ర యూనిట్ స్పందింస్తుందో వేచిచూడాల్సిందే మరి. ఇక, ఈ చిత్రంలో నాగ్ సరసన అనుష్క, ప్రగ్యా జైశ్వాల్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం. కీరవాణి. ఎ. మహేష్ రెడ్డి నిర్మాత.

- Advertisement -