హోదా కోసం తిరగబడతాం ..

96
Pawan Desh Bachao Protest for Special Status

కేంద్రంపై మరోసారి ఫైరయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. ట్విట్టర్ వేదికగా కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసిన పవన్ ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే తిరగబడతామని హెచ్చరించారు. ఈ పోరుకు ఆంధ్రా యువత సన్నద్ధం కావాలన్నారు.

‘తిడితే భరించాం.. విడగొట్టి గెంటేస్తే సహించాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే.. తిరగబడతాం!! అన్నది ఆంధ్రా యువత కేంద్రానికి తెలియ చెప్పాలి. గాంధీజీని ప్రేమిస్తాం. అంబేద్కర్‌ని ఆరాధిస్తాం. సర్దార్‌ పటేల్‌కి సెల్యూట్‌ చేస్తాం. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కానీ.. తల ఎగరేసే ఉత్తరాది న్యాయకత్వం.. దక్షణాది ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూపోతే మాత్రం.. చూస్తూ కూర్చోం. మెడలు వంచి, కింద కూర్చోపెడతాం’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర యువత ఈ నెల 26న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో చేపట్టనున్న మౌన నిరసన ప్రదర్శనకు తమ పార్టీ మద్దతుగా ఉంటుందని పవన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.