లోక్ సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నిక

6
- Advertisement -

18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ముజువాణీ ఓటుతో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా గెలుపొందారు. మూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం సాధించినట్లు ప్రొటెం స్పీకర్‌ బర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు.

అంతకముందు లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా మంత్రులు, ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. ఓంబిర్లాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అభినందనలు తెలిపారు.

ఇండియా కూటమి తరఫున కె.సురేశ్‌ పేరును శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్‌ సావంత్‌ తీర్మానం చేశారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం స్పీకర్‌ పదవికి ఎన్నిక చేపట్టగా ఓం బిర్లా విజేతగా నిలిచారు.

Also Read:ఎస్ బాస్… షూటింగ్ పూర్తి

- Advertisement -