ఆలివ్స్ తో ఆరోగ్యం!

41
- Advertisement -

ఆలివ్ ఆయిల్ గురించి అందరికీ తెలుసు. వంటల్లో విరివిగా ఉపయోగించే వంట నూనె. ఇతర అయిల్స్ తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. పైగా ఇందులో కొలెస్ట్రాల్ శాతం కూడా తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలే తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే కేవలం ఆలివ్ ఆయిల్ ద్వారా మాత్రమే కాకుండా ఆలివ్ పండ్ల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆలివ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా హైబీపీ, లోబీపీ వంటి సమస్యలను అదుపులో ఉంచడంలో సహాయ పడతాయి.

ఇంకా ఆలివ్స్ లో కొవ్వు ఆమ్లాలు ఉన్నప్పటికి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయ పడతాయి. ఇంకా ఆలివ్స్ లో ఉండే మోనోశాచురేటెడ్ యాసిడ్స్ ఆకలిని దూరం చేస్తాయి. తద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. ఇంకా ఆలివ్స్ చర్మ సంరక్షణ కు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే టోకోఫెరెల్స్ చర్మ క్యాన్సర్ కారకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. ఇంకా చర్మం పొడిబారడం, వృద్దప్య ఛాయలు రావడం వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఆలివ్స్ లో ఉండే ఫ్లేవనాయిడ్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహద పడతాయి. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు టైప్ 2 డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయట. ఇంకా ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలో కూడా ఆలివ్స్ అంతగానో మేలు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

గమనిక : ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి మీ అవగాహన నిమిత్తం అందించడం జరిగింది. కాబట్టి వీటిని తినే విషయంలో ఆరోగ్య నిపుణులను వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

Also Read:డయాబెటిస్‌..ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా!

 

- Advertisement -