భయం లేదు..ఎక్కడికి పారిపోలేదు!

136
gelenski
- Advertisement -

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ దేశ రాజధాని కీవ్‌ టార్గెట్‌గా రష్యా వైమానిక దాడి చేస్తుండగా ఉక్రెయిన్ సైన్యం సైతం ధీటుగా జవాబిస్తోంది. ఇక ఉక్రెయిన్‌కు మద్దతుగా పలు దేశాలు నిలవగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తన ఫ్యామిలీతో కలిసి దేశం విడిచిపారిపోయారంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి.

ఈ పేపథ్యంలో స్పందించారు జెలెన్ స్కీ భార్య ఒలెనా జెలెన్ స్కీ. నా భర్త ఎక్కడికి పోలేదు.. ఇక్కడే యుక్రెయిన్ లోనే ఉన్నాడు.. ఆయన వెంట నేనూ కూడా ఉన్నాను అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమకు భయం లేదని ఎక్కడికి పారిపోలేదని తేల్చిచెప్పింది.

- Advertisement -