పెద్ద నోట్ల రద్దుతో రోజురోజుకు సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడంలేదు. నోట్ల రద్దుతో యావత్త్ దేశం మొత్తం అతలకుతలమైంది. రద్దుతో సామాన్య ప్రజల నుంచి మొదలైన కష్టాలు నల్ల కుబేరుల వరకు కొనసాగుతునే వున్నాయి. నల్లకుబేరులు తమ దగ్గరనన్న డబ్బును ఏం చేయాలో తోచక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సామాన్యులు తమ పనులన్ని మానుకొని రోజు బ్యాంక్ క్యూలైన్లో నిలుచోని తనకు కావాల్సిన నగదును విత్‌డ్రా చేసుకుని తీసుకెళ్తున్నాడు. బ్యాంక్‌లో నగదు రూ.4000 వేలు మాత్రంమే ఇస్తున్నారు అదికూడా రెండు రెండు వేయ్యిల రూపాయలనోట్లు మాత్రమే దీంతో చిల్లర కష్టాలు మొదలైయ్యాయి. రూ.2000నోటుకు చిల్లర దొరకకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. నోట్లరద్దు బాగానే ఉందని సమర్థిస్తున్నే ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలంమైనట్లు కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే మోడీ తీసుకున్నపెద్ద నోట్ల రద్దు ఈ నిర్ణయంతో లక్షల కోట్ల విలువ చేసే రూ.1000,500 నోట్లు బ్యాంకుల్లోకి చేరాయి. బ్యాంకుల నుంచి ఆర్బీఐకి తరలించారు. అయితే ఇన్నాళ్లు ఆ పాత నోట్లను ఏం చేస్తారనే విషయం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది. తలుపులు తదితర వుడ్ సంబంధిత ఉత్పత్తుల్లో వాటి మిశ్రమాన్ని వాడతారని తేలింది.
ఇప్పుడు తాజాగా ఈ నోట్లకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పాత వేయ్యి,ఐదు వందలరూపాయిల నోట్లను ఆర్బీఐ పలు వుడ్ ఫ్యాక్టరీలకు అమ్మేస్తోందట. కేరళలోని వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్ అనే కంపెనీ వీటిని కొంటోంది. అయితే ఆర్బీఐ ఈ నోట్లను ఎంతకు అమ్ముతుందో తెలిస్తే మనం కంగతిన్నాల్సిందే. టన్ను రూ.250 చొప్పున పాత నోట్లను అమ్ముతోంది. ఇంత తక్కువ అని మనం ఆశ్చర్యపోనవసరంలేదు. ఇన్ని రోజులు అవి మనకు పచ్చ నోటు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ వాళ్లకు చిత్తు కాగితం. సో దేనికైన మరణం తప్పదు ఇప్పుదు పెద్ద పాత నోట్లకు కూడా మరణం తప్పలేదు.