సీఎం కేసీఆర్ దేవుడు.. ఏపీ పెద్దాయన కితాబు

29
- Advertisement -

సీఎం కేసీఆర్‌… ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తోన్నపేరు.. ఒక రాష్ట్రానికి సీఎం గానే కాదు.. ఆ రాష్ట్రాన్ని సాధించి… కొత్త రాష్ట్రమైనా.. అభివృద్ధిలో పరుగులు పెడుతూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సాధించిన రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన నాయకుడుగా సీఎం కేసీఆర్‌ ను దేశవ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చి దేశ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించబోతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్‌పై ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ పెద్దాయన తన అభిమానాన్ని చాటుకున్నాడు. సీఎం కేసీఆర్‌ ఫోటోకు దండం పెడుతూ ప్రజల దేవుడు కేసీఆర్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

భద్రాచలంలోని ఓ మీసెవ సెంటర్‌కు వచ్చిన 85 ఏండ్ల పెద్దాయన రేషన్‌ కార్డు కావాలని కోరగా..ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి తెలంగాణలో రేషన్‌ కార్డు ఇవ్వరు అని చెప్పడంతో బయలుదేరిన పెద్దాయన వెంటనే కేసీఆర్‌ పోటోకు దండం పెట్టి అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ సంఘటనతో సీఎం కేసీఆర్‌ ను ఏపీ ప్రజలు ఏ స్థాయిలో అభిమానిస్తున్నారో తెలుస్తోంది. దీంతో పాటు ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీకి సైతం ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీలో ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తాము పనిచేసేందుకు సైతం ఏపీ ప్రజలు సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి 

చండూరు ను అద్దంలా తీర్చిదిద్దుతా : కేటీఆర్‌

ఢిల్లీ మేయర్‌కై కొట్లాట…

హుజూర్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

- Advertisement -