ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించాలి- సీఎం

243
kcr

దేశం నుండి కరోనాను తరిమికొడుతున్నామన్న ఐక్యతను చూపించేందుకు దీపాలు వెలిగించాల ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇంట్లోని విద్యుత్తు దీపాలు ఆర్పేసి బాల్కనీలోకి రావాలని.. లైట్ ఉంటే లైట్, కొవ్వొత్తి ఉంటే కొవ్వొత్తి, ఫోన్ ఉంటే ఫ్లాష్ లైట్ వెలగించాలన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5 నెల రాత్రి 9 గంటలకు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మానవజాతి తనకు పట్టిన పీడపై చేస్తోన్న గొప్ప పోరాటం స్ఫూర్తివంతంగా సాగాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.