మాస్ హీరో విశాల్-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా డబ్బింగ్ జరుపుకుంటోంది. నవంబర్ 7న ఆడియో, నవంబర్ 18న సినిమా రిలీజ్.
ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ – ”ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో డబ్బింగ్ జరుగుతోంది. జగపతిబాబుగారు, బ్రహ్మానందంగారు, జె.పి.గారు డబ్బింగ్ పూర్తి చేశారు. మిగతా ఆర్టిస్టుల డబ్బింగ్ జరుగుతోంది. నవంబర్ 7న ఈ చిత్రం ఆడియో రిలీజ్ చేసి, నవంబర్ 18న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లను చాలా రిచ్‌గా తియ్యడం జరిగింది. సినిమాకి అవి చాలా పెద్ద హైలైట్ అవుతాయి. హిప్‌హాప్ తమిళ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమా విశాల్ కెరీర్‌లోనే కాస్‌ట్లియస్ట్ మూవీ. మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం విశాల్‌కి మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది.
నవంబర్ మొదటి వారంలో ఆడియోను రిలీజ్ చేసి, నవంబర్ 18న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘ఒక్కడొచ్చాడు’ విశాల్‌కి తెలుగులో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది” అన్నారు.
విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్: ఆర్.కె.సెల్వ, డాన్స్: దినేష్, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.