లవ్ వెర్సస్ డెస్టినీ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఒక్క క్షణం’. ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు వారబ్బాయి శిరీష్ హీరోగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఒక్క క్షణం టీం..ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడట. తమ్ముడి కోసం అర్జున్ రానుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే ట్రైలర్‌తో అదరగొట్టాడు అల్లు శిరీష్ . నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకు వస్తే.. ఫేట్‌తోనైనా, డెస్టినీతోనైనా, చివరికి చావుతోనైనా పోరాడతా అంటూ శిరీష్ చెప్పిన డైలాగ్‌లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. తన ప్రేమను గెలుపించుకునేందుకు డెస్టినీతో ఫైట్ చేసేందుకు రెడీ అయ్యాడు.
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో శిరీష్ సరసన సురభి నటిస్తుండగా.. అవసరాల శ్రీనివాస్ కీ రోల్ పోషించారు. లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మితగా వస్తున్న ఈ సినిమా హిట్‌తో న్యూఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నాడు.