ఒక రాధ ముగ్గురు కృష్ణులు ఆడియో..

299
Oka Radha Mugguru Krishnulu Movie Audio Launch
- Advertisement -

ఎన్ సి సి సమర్పణలో దృవ ఆర్ట్స్ ఫిలిమ్స్ పతాకంపై అభిషేక్, అభి, డి. ఆకాష్ మరియు అనూష వేణుగోపాల్ హీరో హీరోయిన్ గా పరకోటి బాలాజి దర్శకత్వంలో దృవ చరణ్ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘ఒక రాధ ముగ్గురు కృష్ణులు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురువారం ఫిలింనగర్‌లో సినీ ప్రముఖుల అశీసులతో ఘనంగా జరిగింది. ఈ ఆడియో వీడుక కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సంతోషం మ్యాగజిన్ అధినేత శసురేష్ కొండేటి, ముత్యాల రాందాస్, శ్రీరంగం సతీష్ కుమార్, మోహన్ గౌడ్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గున్నారు. ముఖ్య అతిధులు సి డి ని విడుదల చేసి దర్శకుడు పరకోట బాలాజీకి, నిర్మాత దృవ చరణ్‌కి మరియు హీరో హీరోయిన్‌కి వారి బెస్ట్ విషెస్ అందించారు.

అనంతరం వారు మాట్లాడుతూ “దర్శకనిర్మాతలు ఎంతో శ్రమతో కృషితో సినిమాని నిర్మిస్తారు కానీ సినిమా బాగుంటేనే వాళ్లకి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా ‘ఒక రాధ ముగ్గురు కృష్ణులు’ ట్రైలర్ బాగుంది. మా ఫిలిం చాంబర్ తరుపున ఎప్పుడు వాళ్ళకి సహాయసహకారాలు అందిస్తాము. చిన్న సినిమాలని అందరు ప్రోత్సహించాలి. ఈ సినిమా హిట్ కావాలి అని కోరుకుంటున్నాను ” అని తెలిపారు.

Oka Radha Mugguru Krishnulu Movie Audio Launch

సురేష్ కొండేటి మాట్లాడుతూ “గతంలో కమల్ హస్సన్ ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమా చాల సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఒక రాధా ముగ్గురు కృష్ణులు మరింత విజయం కావాలి అని కోరుకుంటున్నాను. పరకోటి బాలాజీకి అల్ ది బెస్ట్ ” అని ముగించారు.

మోహన్ గౌడ్ మాట్లాడుతూ “దర్శకుడు బాలాజీ నాకు చాలా కాలంగా తెలుసు. ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సినిమా తీస్తాను అని ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్న వ్యక్తి . ఇప్పుడు ఈ చిత్రంతో తన కొడుకుని కూడా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా ఒక రాధ ముగ్గురు కృష్ణులు, వెరైటీ గా ఉంది టైటిల్. మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంది. సంగీతం చాల బాగుంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ జయ సూర్యకి నా శుభాకాంక్షలు. ఈ సినిమా మంచి విజయవంతం కావాలి ” అని కోరుకున్నారు.

Oka Radha Mugguru Krishnulu Movie Audio Launch

దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ “ఒక రాధ ముగ్గురు కృష్ణులు, ఈ సినిమా కథ శ్రీరంగం సతీష్ కుమార్‌కి చెప్పాను, కథ బాగా నచ్చి, సతీష్ కుమార్ సహాయంతో సినిమా మొదలు పెట్టాను. కొత్తవాళ్లతో సినిమా మొదలు పెట్టాను, మంచి కామెడీతో రొమాంటిక్‌గా యూత్ ఫుల్ ఉంటుంది సినిమా. వచ్చేనెల జూన్‌లో విడుదల చేస్తాం.

శ్రీరంగం సతీష్ కుమార్ మాట్లాడుతూ “నేను నిర్మాత దర్శకుడిని అయినా కూడా బాలాజీ మీద నమ్మకంతో సినిమా కథ పై నమ్మకంతో ఒక మంచి చిత్రం చేయటానికి సన్నాహాలు చేసాం. ఇది చిన్న చిత్రం కాదు కానీ మంచి చిత్రం. గతంలో జాంబ లకిది పంబ, చిత్రం భళారే విచిత్రం కథ కథనంతో సక్సెస్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలాంటి కథ కథనంతో అనుకున్న బడ్జెట్ లోనే నిర్మించాం. సినిమా చాల బాగా వచ్చింది. విజయవంతం అవ్వాలని కోరుకుంటున్న” అని తెలిపారు . హీరోయిన్ అనూష వేణు గోపాల్ మాట్లాడుతూ “బాలాజీ నాకు మంచి అవకాశం ఇచ్చారు, కుటుంబ సభ్యులందరు కలిసి చూడదగ్గ చిత్రం”అని తెలిపారు.

సంగీత దర్శకుడు జయ సూర్య మాట్లాడుతూ “గతం లో 25 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను, ఈ సినిమా లో మూడు పాటలు ఉన్నాయ్. మంచి పాటలు, ఈ అవకాశం కోసం బాలాజీకి ధన్యవాదాలు. పాటలు మరియు సినిమా మంచి హిట్ కావాలి అని కోరుకుంటున్న” అని తెలిపారు… ఎన్ సి సి సమర్పించు.. బ్యానర్ : దృవ ఆర్ట్ ఫిలిమ్స్, కెమెరా : నగేష్ యర్రవరపు, సంగీతం : జయ సూర్య, పాటలు : జయ సూర్య, మాటలు : కె . ప్రసాద్ ,ఫైట్స్ : అవినాష్, డాన్స్ : వినోద్,కో – డైరెక్టర్ : చల్లపల్లి వెంకటేశ్వర్లు, నిర్మాత : దృవ చరణ్, దర్శకుడు : పరకోటి బాలాజీ ,నటి నటులు :అభిషేక్,అభి,డి. ఆకాష్,అనూష వేణు గోపాల్,మల్లాడి బాబు,రైజింగ్ రాజు, జూనియర్ రాజశేఖర్ ,శశి ,బాలాజీ.

- Advertisement -