- Advertisement -
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపుదిద్దుకున్న వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (ఓసీఎఫ్ఎస్). నవంబర్ 19 నుంచి ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ అఫిషియల్ ట్రైలర్ ను కింగ్ నాగార్జున ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ద్వారా జీ5 ఎంటర్టయిన్ మెంట్ మనందరికీ ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ లాంటి వినోదాన్ని అందించబోతోందని నాగార్జున పేర్కొన్నారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. సంగీత్ శోభన్, సిమ్రన్ శర్మ, గీత్ సైనీ, సీనియర్ నటులు నరేశ్, తులసి నటించిన ఈ వెబ్ సిరీస్‌కు మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించాడు.
- Advertisement -