20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు…

49
niranjan
- Advertisement -

రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్త‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన నిరంజన్ రెడ్డి… ఉద్యాన శాఖ నుంచి విస్తృతంగా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు. ఆయిల్ పామ్ తోట‌ల సంద‌ర్శ‌న‌తో పాటు సాగు, ఆదాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు నిమిత్త‌మై 10 ల‌క్ష‌ల 90 వేల ఎక‌రాల‌ను అనువైన ప్రాంతంగా సూచించింది. పంట మార్పిడి విధానంలో భాగంగా భారీ స్థాయిలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామ‌ని తెలిపారు.

రాష్ట్రంలో ఆయిల్ పామ్ న‌ర్స‌రీలు, ఆయిల్ ఎక్స్‌ట్రాక్ష‌న్ ఫ్యాక్ట‌రీల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఆయిల్ పామ్ సాగు నిమిత్తం రైతుల్లో చైత‌న్యం పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని నిరంజ‌న్ రెడ్డి తెలిపారు.

- Advertisement -