ఇలాంటి ఫీట్ ఎప్పుడూ చూసి ఉండరు..

222
dance
- Advertisement -

బుల్లితెరపై ఇప్పటివరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. అందులో కంటెస్టెంట్స్‌,వారి పర్ఫార్మెన్స్ ఆధారంగా వారు చేసే ఫీట్స్ ఆధారంగా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అలాంటి రియాల్టీ షోలో ఇలాంటి ఫీట్‌ను మాత్రం ఎప్పుడు చూసి ఉండరు. కళ్లు గగ్గుర్లు పొడిచేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికా టీవీ రియాల్టీషో అమెరికా’స్ గాట్ టాలెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాపేజ్ ట్రిక్స్ చేసే జంట నిల్సన్,అతని భార్య చేసిన విన్యాసం అందరిచేత ఔరా అనిపిస్తోంది. చుట్టూ మంట,పైన రింగులపై విన్యాసాలు చూడటానికి అద్భుతంగా ఉన్న చివర్లో జరిగిన విషాద సంఘటన ఈ వీడియో చూసిన వారి కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఫీట్‌ చేస్తున్న క్రమంలో పట్టుతప్పి మహిళ కిందపడిపోగా.. అందరి ఊపిరి ఒక్క క్షణం ఆగినంతపనైంది. కానీ రక్షణ చర్యలు ఉండటంతో ఆమె సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగలిగారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి

- Advertisement -