టాలీవుడ్ బ్యూటీ అక్కినేని సమంత తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ సినిమాలో నటించింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత స్వాతి అనే క్యారెక్టర్ చేస్తోంది. ఈ సినిమాను కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది.
ఇందులో ఓ వృద్ధురాలికి మళ్లీ యవ్వన వయసు వస్తే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. సమంత వృద్ధురాలయ్యాక ప్రముఖ నటి లక్ష్మి పాత్రలో కనిపిస్తారు. రాజేంద్రప్రసాద్ సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్ కుమారుడిగా, మాస్టర్ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు.
ట్రైలర్లో.. ‘తెల్లవారుజామున నాలుగు గంటలకు సన్నటి వర్షం.. ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు. ఆ మెరుపు వెలుగులో బేబీ. బేబీ 70 ఏళ్ల ముసల్ది కాదు. 24 ఏళ్ల పడుచు పిల్ల’ అని రాజేంద్ర ప్రసాద్.. రావు రమేశ్‌తో చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘దేవుడు మళ్లీ వయసిచ్చాడు. ఆ వయసు మళ్లీ రెక్కలు విప్పుకొంటుంది’ అంటూ సమంత ఏడుస్తూ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. జులై 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.