దేశం గర్వించదగ్గ ప్రాజెక్టు ఇది.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

367
Minister V Srinivas Goud
- Advertisement -

దేశంలోనే ప్రతిష్టత్మకమై కాళేశ్వరం ప్రజెక్ట్‌ రేపు ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ ,దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి టీఆర్‌ఎస్సెల్సీ కార్యలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…రేపు ప్రారంభించ బోయే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణయే కాదు దేశం గర్వించదగ్గ ప్రాజెక్టు. అంతర్జాతీయంగా పెద్ద ప్రాజెక్టు ఇది. అందరూ గర్వించాల్సిన ప్రాజెక్టు ఇది.. అయినా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నేతలకు మాత్రం ఇది మింగుడుపడటం లేదు. తెలంగాణ.. దేశంలో అంతర్భాగం కానట్టుగా బీజేపీ నేతలు కాళేశ్వరంపై మాట్లాడుతున్నారు. బీజేపీ నేతల అవగాహన లేని మాటలు బాధ కలిగిస్తున్నాయి. కేంద్రం డబ్బులిచ్చినా పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సొంత డబ్బులతో నిర్మించింది. కెసిఆర్ రోజుకు నాలుగు గంటలు కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే వెచ్చించారు.

Minister V Srinivas Goud

అందుకే మూడేళ్ళలో ప్రాజెక్టు పూర్తయ్యింది. రొటీన్‌గా ఇచ్చే అనుమతులు కూడా తమ వల్లే వచ్చాయని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. అనుమతులు ఇవ్వకపోవడానికి తెలంగాణ దేశంలో లేదా ?. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పిలవలేదని బీజేపీ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని అనుమతులున్నా అక్కడ ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. గుజరాత్‌లో కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టారా?. బీజేపీ నేత లక్ష్మణ్ నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే పెద్దగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ,పరిషత్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనందుకు బీజేపీ ఆత్మ పరిశీలన చేసుకోదా?. అన్నారు. తెలంగాణపై బీజేపీ నేతలది కక్ష పూరిత వైఖరి. ఫిరాయింపులపై బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. తెలంగాణలో పిరాయింపులపై మాట్లాడుతున్న బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌లో ఎందుకు చేర్చుకుంటున్నారు? అని మంత్రి ప్రశ్నించారు. ఇక్కడ కూడా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరుతారంటున్నారు. మరి ఎందుకు చేర్చుకుంటున్నారు?.

నీతి ఆయోగ్ సమావేశానికి కెసిఆర్ రాకపోతే బీజేపీ రాజకీయం చేస్తోంది. నాలుగు సార్లు నీతి ఆయోగ్ సమావేశానికి కెసిఆర్ వెళితే తెలంగాణ కు కేంద్రం ఏమిచ్చింది?. కనీసం నీతి ఆయోగ్ సిఫారసులు అమలు చేయాలని బీజేపీ నేతలు కేంద్రాన్ని ఎపుడైనా కోరారా?. నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తేనే బీజేపీ ఎగిసి పడుతోంది. మేము రికార్డు స్థాయిలో 32 జడ్పీలను గెలిచాం దానికేమంటారు.ఎన్నికల ముందు సెంటిమెంట్ రెచ్చగొట్టి గెలవడం బీజేపీకి అలవాటుగా మారింది. పేదల సంక్షేమ ఎజెండాతో ముందుకు సాగుతున్న టీఆర్ఎస్సే. తెలంగాణలో మిగిలే ఏకైక పార్టీఅని అన్నారు. బీజేపీ నేతలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు కుజాతీయ హోదా సాధించి మాట్లాడండి. కలహాలు పెట్టడం మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గెలవడమే బీజేపీ పని.. తెలంగాణకు నిధులు సాధించడంలో బీజేపీ నేతలు శ్రద్ద పెట్టాలి అన్నారు.

తెలంగాణలో 80 శాతం భూభాగానికి నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఓ శుభకార్యం. శుభకార్యం సందర్భంగా రచ్చ చేయడం మంచిది కాదు. కొత్తగా గెలిచిన బీజేపీ ఎంపీలు స్థాయి మరచి మాట్లాడుతున్నారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు ఏమైందో బీజేపీ ఎంపీ చెప్పాలి. హోం శాఖ సహాయ మంత్రి హైదరాబాద్‌పై ఉగ్రవాద ముద్రవేసి తెలంగాణకు పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేలను పిలవలేదని కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుక దగ్గర వాహనాలకు తగిన సౌకర్యం లేకపోవడం వల్లే కొంతమంది తోనే కార్యక్రమం జరుగుతోంది. ఎమ్మెల్యేలు ,మంత్రుల విజ్ఞప్తి మేరకే సీఎం కెసిఆర్ పరిమితంగా ఈ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదలయ్యాక మరో సారిఘనంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు.

- Advertisement -