రివ్యూ: ఓ బేబి

922
o baby review
- Advertisement -

స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ఓ బేబీ. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత.. ‘ఓ బేబీ’ అంటూ సోలోగా ప్రేక్షకుల్ని అలరించేందుకు థియేటర్స్‌లో ఎంటర్ అయ్యింది.ట్రైలర్,టీజర్‌లతో ఆకట్టుకున్న సమంత ఓ బేబితో ఎలాంటి మ్యాజిక్ చేసిందో చూద్దాం…

కథ:

లక్ష్మి చిన్నవయసులోనే పెళ్లి జరుగుతుంది. యుక్తవయసులోకి రాగానే భర్తను కోల్పోతుంది. పెద్దవయసు వచ్చాక తన పిల్లలు, మనవళ్లతో కలిసి ఉంటుంది. తన పెద్దవయసు ప్రవర్తన, అతి ప్రేమ వల్ల పిల్లలు కూడా మారిపోతారని ఆమెను ఓ వృద్దాశ్రమంలో ఉంచుతారు. అదే సమయంలో ఆమె వయసు తగ్గిపోతుంది. అసలు పెద్దవయసులో ఉన్న లక్ష్మి.. యుక్తవయసులో ఉన్న సమంతగా ఎలా మారింది..? తన కలలను ఎలా ఎలా నెరవేర్చుకుంది అన్నదే ఓ బేబి కథ.

Image result for samantha oh baby

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, స్క్రీన్ ప్లే ,సమంత,నటీనటులు. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రిమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చేశారు. సినిమాలో నటించిన అందరూ పోటీపడి ఒకరికి మించి మరొకరు నటించారు. ముఖ్యంగా సమంత తన నటనతో ఆకట్టుకుంది. కామెడీ, ఎమోషన్స్ అన్నింటిని అద్భుతంగా పలికించింది. తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. లక్ష్మీ సైతం సమంతతో పోటీ పడి నటించింది. మిగితా నటీనటుల్లో రావు రమేష్‌,రాజేంద్రప్రసాద్,జగపతిబాబు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్‌ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా సాగతీత. సెకండ్ హాఫ్ కామెడీ తగ్గడం, ఎమోషన్స్ ఎక్కువగా ఉండటం మైనస్‌.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. కొరియన్ మూవీని తెలుగు నెటివిటికి తగ్గట్టుగా నందిని రెడ్డి డీల్ చేసిన విధానం బాగుంది. గ్రిప్పింగ్ స్క్రిన్ ప్లేతో ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా ప్రజెంట్ చేసేందుకు చాలా కష్టపడింది. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్.ఎడిటింగ్,సినిమాటోగ్రఫీ బాగుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for samantha oh babyతీర్పు:

వయసు చేతిలో ఉండగా ఏదో చేయాలని అనుకుంటాం. అలా ఆలోచిస్తూ ఉండగానే..వయసైపోతుంది. అయ్యో అప్పుడు ఏం చేయలేకపోయామే అని బాధపడిపోతుంటారు. అలాంటి వాళ్లకు తిరిగి వయసు తగ్గిపోతే లైఫ్ లో ఎలా ఉంటారు అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఓ బేబి. సమంత నటన,కథ సినిమాకు ప్లస్ పాయింట్‌ కాగా సెకండాఫ్ సాగదీత మైనస్ పాయింట్స్‌. ఓవరాల్‌గా సమంత ఓ బేబి…ఓ రోలర్ కోస్టర్‌.

విడుదల తేదీ:05/7/2019
రేటింగ్:3.25/5
నటీనటులు: సమంత, నాగశౌర్య
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాత: సురేష్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: నందిని రెడ్డి

- Advertisement -