ఓజీ..యుఎస్‌లో హవా!

6
- Advertisement -

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న క్రేజీ మూవీ ఓజీ. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సుజీత్ కూడా అదే తరహా మాస్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

పవర్ పంచ్ యాక్షన్ సన్నివేశాలు, ఫ్యాన్స్ కోసం ప్రత్యేకమైన మోమెంట్స్‌తో కూడిన ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది. అమెరికా ప్రీమియర్ పూర్తి స్థాయి బుకింగ్స్ ప్రారంభం కాకముందే, 630కి పైగా షోస్‌ నుండి ఈ సినిమా ఇప్పటికే $300K వసూలు చేసింది.

బుకింగ్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్న తర్వాత మరింత హడావిడి కొనసాగే అవకాశం ఉంది. రెండు రోజుల్లోనే $1 మిలియన్ వసూలు చేయడం? పూర్తిగా సాధ్యమేనని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటించగా, ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:AP:క్రీడాకారులకు ప్రోత్సహకాలు

- Advertisement -