#OG పవన్ తో రెండు భాగాలా?

44
- Advertisement -

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న #OG సినిమా ఇటీవల గ్రాండ్ గా లంచయిన విషయం తెలిసిందే. స్టార్టయినప్పటి నుండి ఈ సినిమా చుట్టూ చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. సినిమాలో సాంగ్స్ , ఫైట్స్ ఉండవనే ప్రచారం గట్టిగా ఉంది. అయితే తాజాగా మరో రూమర్ వినిపిస్తుంది. ఈ సినిమాను సుజీత్ రెండు భాగాలుగా తెరకెక్కించనున్నాడని అంటున్నారు.

నిజానికి హరి హర వీరమల్లు కూడా రెండు భాగాలుగా రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు #OG కూడా రెండు పార్ట్స్ అనే టాక్ ఉంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రారంభం నుండే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. సాహొ సినిమాను డీల్ చేసిన సుజీత్ పవన్ ఎలా చూపిస్తాడు ? ఎలాంటి కంటెంట్ ప్లాన్ చేస్తున్నాడు ? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఉన్నాయి.

ప్రచారంలో ఉన్నట్టు పవన్ ఒజీ రెండు భాగాలుగా రానుందా ? లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ చుట్టూ ఇలాంటి న్యూస్ లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

ఇవి కూడా చదవండి…

మృణాల్ మజాకా.. పర్ఫెక్ట్ ప్లానింగ్

ఆ యాంకర్ పెళ్లి ఉత్తదే

మైఖేల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాని

- Advertisement -