OG Review:ఓజీ మూవీ రివ్యూ

11
- Advertisement -

పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం OG. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌తోనే అంచనాలను ఆకాశానికెత్తేసింది. ఈ భారీ చిత్రంతో ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా వస్తుండటంతో ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ ఎలా ఉందో చూద్దాం..

కథ:

1990లలో ముంబై నేపథ్యంలో కథ సాగుతుంది. సత్యదాదా (ప్రకాశ్ రాజ్) అనే పోర్ట్ యజమాని సామ్రాజ్యం, మిరజ్‌కర్ (తేజ్ సప్రు) మరియు అతని క్రూరమైన కొడుకు జిమ్మీ (సుధేవ్ నాయర్) దాడులతో కూలిపోతోంది. పేలుడు పదార్థాలతో నిండిన కంటైనర్ మిస్సయ్యాక నగరంలో హింస చెలరేగుతుంది. జిమ్మీ నిర్దాక్షిణ్యంగా హత్యలు చేస్తూ, సత్యదాదా చిన్న కుమారుడిని కూడా చంపేస్తాడు. ఇదే సమయంలో కంటైనర్ కోసం కళ్ళప్పగించి ఉన్న భయంకరమైన గ్యాంగ్‌స్టర్ ఓమీ భౌ (ఇమ్రాన్ హష్మి) రంగంలోకి దిగుతాడు. ఈ పరిస్థితుల్లో, అందరి చూపు ఒకరిపై పడుతుంది.ఓజస్ గంభీరా అలియాస్ OG (పవన్ కళ్యాణ్). ఒకప్పుడు ముంబైలో హవా చూపించిన ఈ మాబ్ బాస్, ఏదో కారణంతో ఎగ్జైల్‌కి వెళ్లాడు. ఇప్పుడు తిరిగి వస్తూ ప్రతీకారం తీర్చుకునే తుఫాను సృష్టిస్తాడు. OG ఎవరు? ఎందుకు మాయమయ్యాడు? సత్యదాదాతో అతని బంధం ఏమిటి? అన్నదే సినిమా కథ.

ఈ సినిమా పూర్తిగా పవన్ కళ్యాణ్ కోసం రాసినట్టే ఉంది. ఆయన స్వాగ్, యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ అభిమానులను మైమరిపిస్తాయి. హీరోయిక్ ఎంట్రీ ఫైట్ సీన్‌ నుండి ముంబై రీ-ఎంట్రీ వరకు ప్రతి సన్నివేశం ఫ్యాన్స్ కోసం పండగలా ఉంటుంది. హరి హర వీర మল্লు తరువాత వచ్చిన ఈ సినిమా ఆయన అభిమానులకు నిజమైన విందుగా అనిపిస్తుంది. ఇమ్రాన్ హష్మి, ఓమీ భౌ పాత్రలో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. పవన్‌తో ఆయన ఫేస్-ఆఫ్ సీన్స్ సినిమా హైలైట్‌గా నిలుస్తాయి. ప్రియాంక మోహన్ (కన్మని) పాత్రకు ఎక్కువ స్కోప్ లేకపోయినా, కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో బాగానే ఆకట్టుకుంది. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి లాంటి నటులు ప్రభావం చూపారు, కానీ ప్రకాశ్ రాజ్, తేజ్ సప్రు లాంటి వారు సరిగ్గా వినియోగించబడలేదు.

పవన్ కళ్యాణ్ రాంప్‌స్టైల్ ఎంట్రీ, ఇమ్రాన్ విలనిజం, ఇంటర్వెల్ బ్లాక్ – ఇవన్నీ థియేటర్లలో ఊగిపోయే సీన్స్.థమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు జివం పోశాయి.సాహో రిఫరెన్సులు, జాకీ ష్రాఫ్ కామియో వంటి అంశాలు ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటాయి.

కానీ…ఫస్ట్ హాఫ్ బలంగా సెట్ అయినా, సెకండ్ హాఫ్ నెమ్మదించింది. అవసరం లేని సీన్స్, లెంగ్తీ రన్‌టైమ్, కొన్ని అర్ధంతరమైన క్యారెక్టర్ ఆర్క్స్ సినిమా ఇంపాక్ట్ తగ్గించాయి. క్లైమాక్స్‌లో OG ఒక్కరే వందల మందిని కాల్చి పడేయడం రియలిస్టిక్ కంటే సూపర్ హీరో ఫాంటసీలా అనిపిస్తుంది.

Also Read:రెడ్‌బుక్‌కు పోటీగా డిజిటల్ బుక్!

మొత్తం మీద థే కాల్ హిమ్ OG ఒక ఫ్యాన్ సెలబ్రేషన్ మూవీ. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇమ్రాన్ హష్మి స్ట్రాంగ్ డెబ్యూ, తమన్ మ్యూజిక్ ఇవన్నీ సినిమా ప్లస్ పాయింట్స్. కానీ గట్టిపట్టి చెప్పే కథ లేదా లోతైన డ్రామా ఆశించే వారికి నిరాశ పర్చవచ్చు. మొత్తంగా ఓజీ దసరాకు పండగే.

విడుదల తేదీఫ25/09/2025
రేటింగ్:3.5/5
నటీనటులు: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్
సంగీతం: తమన్
దర్శకుడు: సుజీత్

- Advertisement -