OG:ఓజీకి గ్యాంగ్‌లీడర్ హీరోయిన్‌..!

52
- Advertisement -

నాని గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్‌మోహన్ నక్కతోక తొక్కింది. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. సాహో ఫేం సుజిత్‌ దర్శకత్వంలో వస్తోన్న ఓజీ సినిమాపై భారీ అంచనాలు నెలకొంది. సాహో తర్వాత చెపడుతున్న ప్రాజెక్ట్ మరియు పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్నందున్న దీనిపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాను ఏప్రిల్‌ 15నుంచి ఓజీ షూటింగ్‌కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయని టాలీవుడ్‌లో టాక్.

ఈ సినిమాకు రవికే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా ఏఎస్‌ ప్రకాశ్‌ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, వినోధయ సీతమ్ రీమేక్, హరీశ్‌శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

ఏప్రిల్ 30న హీరోని చంపేస్తారట

OTT:ఓటీటీలోకి కబ్జ ఎప్పుడంటే..!

పుష్పకవిమానం..ఎంతోమందిని కాదని అమలకే దక్కింది.!

- Advertisement -