- Advertisement -
పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG చిత్రం విడుదలకు ముందే అమెరికా బాక్సాఫీస్‌పై రికార్డు స్థాయి హంగామా సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో హీరోయిన్‌గా ప్రియాంకా మోహన్ నటించగా, సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ ప్రీ-సేల్స్ ఇప్పటికే 900K డాలర్ల మార్క్‌ను దాటగా, లక్ష్యం 1 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువైంది. విడుదలకు ముందే మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read:మిరాయ్..రజనీ ప్రశంసలు!
DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.
- Advertisement -

