సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజ్ ఇటీవల మీడియాతో మాట్లాడి ఆ చిత్రంతో పాటు ఇతర ప్రాజెక్టుల గురించి వివరాలు వెల్లడించారు.
తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్‌లో అత్యంత ఎదురుచూస్తున్న సీక్వెల్ ‘ఖైది 2’ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం కార్తీ అభిమానులను నిరాశకు గురి చేసింది.
ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, లోకేష్ ఇకపై తాను తీసే అన్ని సినిమాలకు అనిరుధ్‌నే సంగీత దర్శకుడిగా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దీంతో ‘ఖైది 2’కు కూడా అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఈ నిర్ణయం ఖైది అభిమానుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. ఖైది’ సినిమాకి సామ్ సి.ఎస్. అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథనాన్ని ముందుకు నడిపించడంలో, సినిమా ఇంపాక్ట్ పెంచడంలో కీలక పాత్ర పోషించింది. అందువల్ల అభిమానులు సీక్వెల్‌కి కూడా ఆయనే సంగీతం అందించాలని కోరుకుంటున్నారు.అయితే వారి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
Also Read:యూరియా ఇవ్వలేని సర్కార్..రైతుల ఆగ్రహం

