అఫిషియల్..మెగా 154లో రవితేజ!

28
- Advertisement -

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 154వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉండగా రవితేజ చిరంజీవితో కలిసి షూటింగ్ లో జాయిన్ అయ్యాడని తెలియచేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేశారు.

ఈ వీడియోలో రవితేజ కారు దిగి నడుచుకుంటూ చిరంజీవి క్యారవాన్‌ దగ్గరకు వెళ్లాడు. ‘అన్నయ్యా..’అంటూ తలుపు కొట్టగా.. ‘హాయ్‌ బ్రదర్‌’అంటూ చిరంజీవి ఫేస్ కనిపించకుండా కేవలం చెయ్యి అందించారు. రవితేజ ఎప్పటిలాగానే తన స్టైల్ తో కెమెరా వైపు చూసి కన్ను కొట్టి లోపలికి వెళ్ళాడు. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. 2023 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

- Advertisement -