ఏజెంట్ పై మ‌హేష్‌బాబు ప్ర‌శంస‌లు..

77
mahesh
- Advertisement -

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఏజెంట్. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. హాలీవుడ్‌లో లెవల్ స్టంట్స్‌తో టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ టీజ‌ర్‌పై మ‌హేష్ బాబు ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు.

ఏజెంట్ టీజ‌ర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, థీమ్ చాలా బాగున్నాయి. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. దీనిపై అఖిల్ స్పందించి ‘థాంక్యూ బ్ర‌ద‌ర్‌, మీ స‌పోర్ట్‌, ప్రోత్సాహం చాలా విలువైన‌ది’ అంటూ రీట్వీట్ చేశాడు.

మ‌ల‌య‌ళ స్టార్ మమ్ముట్టి కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ఏ.కే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు.

- Advertisement -