ఆఫీసర్…సెకండ్ టీజర్

249
Officer Second Teaser
- Advertisement -

సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆఫీసర్. నాగ్ సరసన మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మే 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సినిమా యూనిట్ రేపు సాయంత్రం మరో టీజర్‌ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. సాయంత్రం 6 గంటలకు టీజర్‌ని విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు.

ఇంతకముందు ఈ సినిమా నుంచి విడుదల చేసిన యాక్షన్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదలు పెట్టిన దానిని పూర్తి చేయడం నా బాధ్యత అంటూ నాగ్ చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంది. గతంలో వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం ‘శివ’. మళ్లీ వీరిద్దరి కలయికలో వస్తున్న ఆఫీసర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నాగార్జున నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాను ఓ స్థాయిలో నిలబెడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

nagarjuna officer

- Advertisement -