నాగ్‌ అభిమానులకు ఇదే నా ఆహ్వానం..

337
Akkineni Nagarjuna
- Advertisement -

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వర్మ డైరెక్షన్‌లో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆఫీసర్’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘శివ’. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ మూవీతో వర్మ మార్క్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘ఆఫీసర్’.

Akkineni Nagarjuna

ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను ఈ నెల 28వ తేదీ రాత్రి ఏడు గంటలకు ఎన్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నట్టు ఓ ట్వీట్ లో తెలిపారు. ‘నాగార్జున ఫ్యాన్స్ అందరికీ ఇదే నా ఆహ్వానం. దయచేసి ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నా. ఈ చిత్రాన్ని జూన్ 1న విడుదల చేస్తున్నాం’ అని వర్మ చెప్పారు.

కాగా, ఈ చిత్రంలో నాగార్జున సరసన మైరా శరీన్ నటిస్తుండగా, నాగ్ కుమార్తెగా చిన్నారి కావ్య నటిస్తోంది. ఈ చిత్రంలోని ‘నవ్వే నువ్వు..’ అని సాగే పాట ఈ నెల 22న విడుదలైంది. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాటను మొత్తం 3.4 లక్షల మంది వీక్షించారు.

- Advertisement -